Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

మీరు బ్రౌజింగ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వెంటనే మీరు ఓ పని చేయండి. లేదంటే రిస్క్ లో పడినట్టే. అవును.. టెక్ దిగ్గజం గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగ

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

Google Chrome

Google Chrome : మీరు బ్రౌజింగ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వెంటనే మీరు ఓ పని చేయండి. లేదంటే రిస్క్ లో పడినట్టే. అవును.. టెక్ దిగ్గజం గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ యూజర్లను హెచ్చరించింది. వెంటనే క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో లైనక్స్, మాక్‌ఓఎస్‌, విండోస్ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో నెలకొన్న సమస్యలను తెలిపింది. జీరో డే హ్యాక్‌ పేరిట పలు క్రోమ్‌ యూజర్లపై సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు గూగుల్‌ వివరించింది.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?

గూగుల్‌ క్రోమ్‌పై సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు గూగుల్‌ ఉద్యోగులు గుర్తించారు. హై-రిస్క్‌ హ్యాక్‌ నుంచి యూజర్లను రక్షించడం కోసం వెంటనే క్రోమ్‌ అప్‌డేట్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలని గూగుల్‌ తెలిపింది. తాజాగా గూగుల్‌ తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో మరింత సెక్యూర్డ్‌ బ్రౌజింగ్‌ అనుభూతిని పొందవచ్చు.

Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?

మీ గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ సురక్షితంగా ఉందో లేదో ఇలా చెక్ చేయండి..
* మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయండి.
* సెర్చ్‌ బార్‌ పక్కన ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్‌ చేసి ‘సెట్టింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* సెట్టింగ్‌ ఆప్షన్స్ లో కిందికి స్క్రోల్‌ చేసి ‘అబోట్‌ క్రోమ్‌’ను సెలక్ట్‌ చేయండి.
* అబోట్‌ క్రోమ్‌ సెలక్ట్‌ చేశాక మీకు ఆప్లికేషన్‌ క్రోమ్‌ వెర్షన్‌ కన్పిస్తోంది.
* మీరు వాడే క్రోమ్‌ వెర్షన్‌ 94.0.4606.61 ఉంటే మీరు వాడే బ్రౌజర్‌ సురక్షితంగా ఉన్నట్లు.. లేకపోతే వెంటనే గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి అప్‌డేట్‌ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా బ్రౌజ్‌ చేసేందుకు చాలామంది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌పైనే ఆధారపడతారు. వరల్డ్ వైడ్ గా 2.65 బిలియన్‌ యూజర్లు గూగుల్‌ క్రోమ్‌ ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్లను గూగుల్‌ క్రోమ్‌ అలర్ట్ చేసింది.