Modi Calls Jagan : సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్, గులాబ్ తుఫాన్‌పై ఆరా

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుం

Modi Calls Jagan : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, రాష్ట్రానికి అండగా ఉంటామని ప్రధాని మోదీ జగన్ కు హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెప్టెంబ‌ర్ 25న తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు 310 కి.మీ, కళింగపట్నానికి తూర్పుగా 350 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది.

Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!

గులాబ్ తుఫాను వేగం పుంజుకుని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమంగా పయనిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశాలున్నాయని… పరిస్థితుల్లో మరింత మార్పు వస్తే సోంపేటలోని బారువ దగ్గర తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, తెలంగాణ, దక్షిణ ఒడిషాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు… మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేశారు. ఈ తుఫాన్ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశముండటంతో మూడు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటే సమయంలో..తీరం దాటిన తర్వాత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జిల్లాలోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రవేటను రద్దు చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 12 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుందని.. అందుకోసం 75 ప్రాంతాల్లో తాము సహాయక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. గులాబ్‌ తుఫాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలపై కూడా పడనుంది. ఇప్పటికే నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర వేటకు వెళ్లవద్దన్న అధికారుల హెచ్చరికల నేపధ్యంలో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. తుఫాను వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సహాయక చర్యల చేపట్టేందుకు SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు