Cyclone Jawad : జొవాద్ జెట్ స్పీడ్..ఉత్తరాంధ్రకు దగ్గరగా

గత అర్ధరాత్రి నుంచే తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీంతో.. తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయి.

Cyclone Jawad Andhra Pradesh : జెట్ స్పీడ్‌తో జొవాద్ దూసుకొస్తోంది. జొవాద్‌ తుపాను.. ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో రెడ్‌ ఎలర్ట్‌ జారీచేశారు అధికారులు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం తీరానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ తెలిపింది. జొవాద్‌ తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందంటున్నారు ఐఎండీ అధికారులు. తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అయితే.. దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చనీ చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Read More : Karnataka : దక్షిణాఫ్రికా వాసి ఎలా తప్పించుకున్నాడు..విచారణకు కర్నాటక సర్కార్ ఆదేశం

మరోవైపు.. గత అర్ధరాత్రి నుంచే తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీంతో.. తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయి. పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చంటున్నారు అధికారులు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించొచ్చని.. దీంతో శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే.. మొన్నటి అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ అతలాకుతలమైంది. ఆ దెబ్బనుంచి ఇంకా కోలుకోకముందే.. ఇప్పుడు జొవాద్‌ తుపాన్‌ ఏపీవైపు దూసుకొస్తోంది.

Read More : Sri Lankan Man : పాకిస్తాన్‌లో ఘోరం.. దైవాన్ని తిట్టాడంటూ శ్రీలంక జాతీయుడి హత్య.. బహిరంగ దహనం

ఈ తుపాన్‌ కారణంగా ఉత్తరాంధ్రకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర తుపానుతో.. పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యవసర సేవల నిమిత్తం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతో పాటు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రుషికొండ బీచ్‌ వద్ద సముద్రం శుక్రవారం 200 అడుగులు వెనక్కి మళ్లింది. దీంతో ఇసుక తిన్నెలు, రాళ్లు బయటపడ్డాయి. తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలనూ ఐదో తేదీ వరకు మూసేయాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు.. సహాయ కార్యకలాపాల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. 64 సహాయక బృందాలు సిద్ధంగా ఉంచారు అధికారులు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు 46 బృందాలను పంపారు. మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచారు.

ట్రెండింగ్ వార్తలు