Karnataka : దక్షిణాఫ్రికా వాసి ఎలా తప్పించుకున్నాడు..విచారణకు కర్నాటక సర్కార్ ఆదేశం

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌తో నవంబర్‌ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు...

Karnataka : దక్షిణాఫ్రికా వాసి ఎలా తప్పించుకున్నాడు..విచారణకు కర్నాటక సర్కార్ ఆదేశం

Omicron Scare Dont Panic People About New Variant, Must Be Taken Precautions

Karnataka Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్నిభయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో మళ్లీ కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు  చేస్తున్నాయి. భారత్ లో కూడా ఈ వేరియంట్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్నాటకలో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే..66 సంవత్సరాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి..కొన్ని రోజుల పాటు బెంగళూరులోని ఓ హోటల్ లో ఐసోలేషన్ ఉన్న తర్వాత కనిపించకుండా పోవడంపై కర్నాటక సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ప్రైవేటు ల్యాబ్ లో నెగెటివ్ సర్టిఫికేట్ పొందడంపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పాజిటివ్ గా తేలిన మూడు రోజులకే నెగెటివ్ ఎలా వచ్చింది ? జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్ ఇంకా రావాల్సి ఉన్నా..దేశం విడిచి వెళ్లిపోవడంపై కలకలం రేపుతోంది. ప్రైవేటు ల్యాబ్ లో ఏమైనా తప్పులు జరిగాయా ? ఎమి జరిగిందనే దానిపై విచారణ చేయాలని పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు…కర్నాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక వెల్లడించారు.

Read More : Sri Lankan Man : పాకిస్తాన్‌లో ఘోరం.. దైవాన్ని తిట్టాడంటూ శ్రీలంక జాతీయుడి హత్య.. బహిరంగ దహనం

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌తో నవంబర్‌ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో ర్యాండమ్‌గా నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్‌ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌కి పంపి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా. అతనికి సోకింది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

Read More : CM Jagan Jawad : ప్రాణనష్టం జరగకూడదు.. జొవాద్ తుపానుపై సీఎం జగన్‌ సమీక్ష

కన్నడ నాట ఒమిక్రాన్‌ ఫియర్‌ మొదలవడంతో ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై మరింత అప్రమత్తమయ్యారు. కర్ణాటక మంత్రులతో భేటీ అయ్యారు. ఒమిక్రాన్‌ వెలుగుచూసిన వెంటనే కేంద్రం హుటాహుటిన బసవరాజ్‌ బొమ్మైను ఢిల్లీకి పిలిపించింది. బూస్టర్‌ డోస్‌పై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు సీఎం పేర్కొన్నప్పటికీ ఆయన ఢిల్లీలో ఉన్న సమయంలోనే బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.