CM Jagan Jawad : ప్రాణనష్టం జరగకూడదు.. జొవాద్ తుపానుపై సీఎం జగన్‌ సమీక్ష

అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..

CM Jagan Jawad : ప్రాణనష్టం జరగకూడదు.. జొవాద్ తుపానుపై సీఎం జగన్‌ సమీక్ష

Cm Jagan Jawad

CM Jagan Jawad : జొవాద్‌ తుపాను పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

‘సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేకాధికారులు అప్రమత్తంగా ఉండాలి. సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యంగా ఉండాలి. మంచి నీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ శుభ్రంగా ఉండాలి. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించాలి. అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహించాలి’ అని జగన్ అన్నారు.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం… ఆరోగ్యానికి మంచిదేనా?

ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం సూచించారు. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా వాటికి గండ్లు పడ్డాయని తెలిసినా లేదా బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపట్టాలన్నారు.