Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం…ఆరోగ్యానికి మంచిదా?…

నిమ్మ‌ర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం…ఆరోగ్యానికి మంచిదా?…

Lemon Water

Lemon Juice : ఉద‌యాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగటం చాలా మందికి అలవాటు. ఇలా చేయటం వల్ల ఉత్సాహంగా ఉండవచ్చని బావిస్తుంటారు. అయితే ఆరోగ్య‌ప‌రంగా చెప్పాలంటే ఉద‌యాన్నే టీ,కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఏమంత శ్రేయస్కరం కాదు. వీటి వల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా కాకుండా ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి.

సాధారణంగా మనమంతా నిమ్మరసంలో చక్కెర లేదా ఉప్పు వేసుకొని తాగుతాం. నిమ్మకాయ ఓ అద్భుత ఫలం. వీటిని వంటల్లో ఉపయోగిస్తాం. పచ్చడి చేసుకుని తింటాం. పులిహోరలో నిమ్మరసం కలిపితే కలిగే రుచే వేరు. లేదంటే లెమన్ టీ తీసుకుంటాం. ఐతే, అదే నిమ్మరసాన్ని రోజూ గ్లాస్ వేడి నీటిలో కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

డయాబెటిస్ ఉన్న‌వాళ్లు నిమ్మ‌ర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు.చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, తాగే నీళ్ల వల్ల చాలా మలినాలు మన బాడీలోకి వెళ్తుంటాయి. ఒక్కోసారి విష పదార్థాలు కూడా లోపలికి వెళ్లి తిష్టవేస్తాయి. వాటికి వేడి నిమ్మరసం సరైన పరిష్కారం. నిమ్మరసం తీసుకోవటం వల్ల శరీరంలో చేరిన మలినాలన్నీ తొలగిపోతాయి.

నిమ్మ‌ర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం వ‌ల్ల చాలా ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు తేలిగ్గా తగ్గిపోతాయి. కిడ్నీలోనే కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా తరిమికొడుతుంది నిమ్మరసం. ఫలితంగా కడుపునొప్పి సమస్య తొలగిపోతుంది. ఇందుకోసం రోజూ వేడి నీటి నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నిమ్మ‌ర‌సం మ‌న చ‌ర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ మెరుస్తుంది. మృదువుగా, కోమలంగా త‌యార‌వుతుంది. ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి. నొప్పులు, వాపులు ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే, బాడీలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగవుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి.