Sri Lankan Man : పాకిస్తాన్‌లో ఘోరం.. దైవాన్ని తిట్టాడంటూ శ్రీలంక జాతీయుడి హత్య.. బహిరంగ దహనం

శ్రీలంక జాతీయుడిని చిత్రహింసలకు గురి చేసి..బహిరంగంగా దహనం చేసినట్లు పేర్కొంది. ఓ పరిశ్రమలో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీలంక జాతీయుడిపై దాడి చేసిన అనంతరం

Sri Lankan Man : పాకిస్తాన్‌లో ఘోరం.. దైవాన్ని తిట్టాడంటూ శ్రీలంక జాతీయుడి హత్య.. బహిరంగ దహనం

Pak

Pakistani Mob Tortures  to death : దైవదూషణలు చేశాడంటూ.. పాకిస్తాన్‌లోని కొన్ని మూకలు.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని చంపేసి, బహిరంగంగా దహనం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సియాల్ కోట్‌లో చోటుచేసుకుంది. సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఓ పరిశ్రమలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయుడిపై దాడి చేసి చంపిన తర్వాత.. మృతదేహాన్ని తగులబెట్టేశారు అక్కడివాళ్లు. మృతుడిని ప్రియాంత కుమారగా గుర్తించామని సియాల్ కోట్ జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు.

Read More : Mom Beats Son With Chappal : ఎయిర్ పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. హార్ట్ టచింగ్ వీడియో

దైవదూషణలు చేశాడని..అతడిని శిక్షించాలంటూ…అక్కడున్న వారు నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెహ్రీక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ (టీఎల్ పీ) పార్టీ మద్దతుదారులని తెలుస్తోంది. ఈ విషయంపై పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాదకరమైన ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని గుర్తించి..చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే విచారణ జరిపి…బాధ్యులను గుర్తించాలని కోరింది.