Mom Beats Son With Chappal : ఎయిర్ పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. హార్ట్ టచింగ్ వీడియో

ఓ తల్లి తన్న కన్నకొడుకునే చెప్పుతో చితక్కొట్టింది. ఆ తల్లి చేసిన పని కొడుకునే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత విషయం తెలిసి.. అంతా.. ఆ తల్లిని ప్రశం

Mom Beats Son With Chappal : ఎయిర్ పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. హార్ట్ టచింగ్ వీడియో

Mom Beats Son With Chappal

Updated On : December 4, 2021 / 12:52 AM IST

Mom Beats Son With Chappal : ఓ తల్లి తన్న కన్నకొడుకునే చెప్పుతో చితక్కొట్టింది. ఆ తల్లి చేసిన పని కొడుకునే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత విషయం తెలిసి.. అంతా.. ఆ తల్లిని ప్రశంసించారు.

తల్లి ప్రేమలోనే కాదు కోపంలోనూ ప్రేమే కనిపిస్తుంది. ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది ఆ అమ్మ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tanzanian Siblings : బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ను లిప్ సింక్‌తో ఊపేశారు.. ఎవరీ టాంజానియా అన్నాచెల్లెళ్లు..!

పాలిస్తీనియన్ అమెరికన్ డ్యాన్సర్, యాక్టర్, య్యూటుబర్ అన్వర్‌ జివాబి తల్లి చాలా రోజుల తర్వాత ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక తల్లి వస్తున్న ఆనందంలో అన్వర్‌.. బొకే పట్టుకుని ప్లకార్డుపై మిస్ యూ మామ్ అని రాసి తల్లికి ఎదురెళ్లాడు.

కొడుకుని చూసిన ఆ తల్లి వెంటనే కిందకు వంగి తన కాలికి ఉన్న చెప్పు చేతిలోకి తీసుకుంది. తనను కౌగిలించుకోవడానికి వచ్చిన కొడుకును చెప్పుతో చితక్కొట్టింది. ఆ తరువాత వెంటనే కొడుకును హత్తుకొని కన్నీరు పెట్టుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అన్వర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. తల్లి ప్రేమను ఎవరూ వర్ణించ లేరు.. ఇది కూడా తల్లి ప్రేమలో భాగమే.. కొడుకును ఎంతలా మిస్‌ అయ్యిందో.. ఇంతలా కొడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

కాగా, అన్వర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. హిలేరియస్ కంటెంట్ క్రియేట్ చేయడంలో దిట్ట. య్యూటూబ్ లో అతడికి 6.6 మిలియన్ల మందికిపైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 8.1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. 30 ఏళ్ల అన్వర్ జివాబి ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో నివాసం ఉంటున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Anwar Jibawi (@anwar)