Daggubati Purandheswari : అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి

పురంధేశ్వరి అమర్ నాథ్ యాత్ర రేపటి(బుధవారం) ముగియనుంది. పురంధేశ్వరి.. అమర్ నాథ్ యాత్ర నుంచి నేరుగా రేపు(బుధవారం) మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Daggubati Purandheswari

Purandheswari Amarnath Yatra : బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు. జులై 3వ తేదీ అర్ధరాత్రి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు బయలుదేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పేరును ప్రకటించే సమయంలో పురంధేశ్వరి అమర్ నాథ్ యాత్రలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించగానే పురంధేశ్వరి కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.

పురంధేశ్వరి అమర్ నాథ్ యాత్ర రేపటి(బుధవారం) ముగియనుంది. పురంధేశ్వరి.. అమర్ నాథ్ యాత్ర నుంచి నేరుగా రేపు(బుధవారం) మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు బీజేపీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిసి పదవి ఇచ్చినందుకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలపనున్నారు.

Mahesh Kumar Goud : కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం : మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం నియమించింది. గత అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరిని నియమించింది. దీంతో ఏపీలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొత్త చరిత్ర సృష్టించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెకు అధిష్టానం కీలక పదవిని అప్పగించింది.

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్రంగా ఆలోచించి ఈ నియామకాన్ని బీజేపీ అధిష్టానం చేపట్టింది. ఉమ్మడి ఏపీలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పని చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు