MLA Maddishetti Venugopal
YCP MLA : ప్రకాశం జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే మాగుంట, బాలినేని వ్యవహారంలో తలమునకలవుతున్న అధిష్టానంకు.. దర్శి వైసీపీ ఎమ్మెల్యే షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇవాళ దర్శిలో తన అనుచర వర్గంతో మద్దిశెట్టి వేణుగోపాల్ సమావేశం కానున్నారు. పార్టీ మారే విషయంపై అనుచరులతో చర్చించే అవకాశం ఉంది.. అనంతరం మీడియా సమావేశం ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!
మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, నియోజకవర్గాల ఇన్ ఛార్జుల మార్పుల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం వేణుగోపాల్ కు హ్యాడ్ ఇచ్చి దర్శి నియోజకవర్గం బాధ్యతలను బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించింది. దర్శి నుంచి తప్పించినా ప్రత్యామ్నాయంగా తాను ఆశిస్తున్న ఒంగోలు ఎంపీ స్థానంకూడా కేటాయించకపోవటంతో మద్దిశెట్టి అదిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తన అనుచర వర్గంతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన ఎంపీ మాగుంట బాటలో నడవాలని నిర్ణయించినట్లు సమచారం.
Also Read : చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నాడు? త్వరలో ప్రజలే తేలుస్తారు
ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో నిలుస్తారని దాదాపు ఖాయమైంది. దీంతో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం.. మాగుంటకు మరోసారి ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వైసీపీ అధిష్టానం మాత్రం పట్టించుకోవటం లేదని సమాచారం. ఈ క్రమంలో పార్టీ మార్పుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనుచరులు మాగుంటపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయన మళ్లీ టీడీపీ గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏం చర్చిస్తారో!.. ఏపీ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
నియోజకవర్గాల వారిగా మంగళవారం మాగుంట అనుచర వర్గాల సమావేశం జరిగింది. ఎంపీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అనుచర వర్గం నిర్ణయించింది. వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న శిద్దా రాఘవరావు, కరణం బలరాం, బాలినేని శ్రీనివాసులు, దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిశెట్టి వంటి నేతలను కలుపుకొని టీడీపీలోకి చేరే దిశగా ఎంపీ మాగుంట అడుగులు వేస్తున్నారని సమాచారం. బాలినేని తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలినేని వైసీపీకి గుడ్ బై చెబితే మాత్రం జిల్లాలో వైసీపీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. బాలినేని ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై వైసీపీ, టీడీపీ, జనసేన శ్రేణులు, జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.