Brahmamgari Matham: బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతులు.. సాయంత్రం మీడియా సమావేశం!

శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది పీఠాధిపతుల బృందం. ఉదయం ఏడు గంటలకే, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించుకున్న పీఠాధిపతుల బృందం.. 9గంటలకు ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు.

Brahmamgari Matham: శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది పీఠాధిపతుల బృందం. ఉదయం ఏడు గంటలకే, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించుకున్న పీఠాధిపతుల బృందం.. 9గంటలకు ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. దర్శనం తర్వాత అమ్మవారి శాల కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు పీఠాధిపతులు.

ఉదయం 11 గంటలకు అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోనున్నారు పీఠాధిపతులు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దయ్య మఠంను దర్శించుకుని తిరిగి బ్రహ్మంగారి మఠానికి చేరుకొనున్నారు పీఠాధిపతులు. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి బ్రహ్మంగారిమఠంలోని పల్నాటి అన్న సత్రంలో దివంగత పీఠాధిపతి శ్రీ వసంత వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులతో చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి పీఠాధిపతుల బృందం వివరాలను వెల్లడించనుంది.

ఇప్పటికే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తామని, బ్రహ్మపదం పీఠాధిపతి కృష్ణమాచార్యులు వెల్లడించారు. దివంగత పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి విజయలక్ష్మమ్మ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణమాచార్యులు.. మేము మొదటి విడతలో బ్రహ్మంగారి మఠం పర్యటించినప్పుడు ఆమె ఎటువంటి ఆక్షేపణ చేయలేదని చెప్పారు. మఠం మేనేజర్ తో పాటు మరికొంతమంది ప్రోద్బలంతోనే ఆమె ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేశారని అన్నారు.

ఇదిలా ఉంటే, బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకానికి సంబంధించిన వివాదం కొలిక్కిరావట్లేదు. పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాలు పోటీ పడుతుండగా.. మఠాధిపతుల బృందం చర్చిస్తుంది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు