ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వ్యవస్థలో మార్పు కోసమే ఈ చట్టాన్ని తీసుకరావడం జరిగిందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో దారుణాలకు బ్రేక్ పడాలనే తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ హత్యాచార ఘటన విషయంలో తెలంగాణ పోలీసులకు, సీఎం కేసీఆర్‌కు మరోసారి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు తెలిపారు. 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం అసెంబ్లీలో హోం మినిస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఇక ఈ చట్టంలోని ముఖ్యాంశాలు : –
* దిశలో రెండు చట్టాలు : 1 ప్రెసిడెంట్ పోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలోనే చర్యలతో చట్టం పాస్ అవుతుంది. 2. ప్రెసిడెంట్ దగ్గరకి వెళ్లేది.
* 13 జిల్లాలకు సంబంధించి..స్పెషల్ కోర్టుల ఏర్పాటు.
* మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల కోసం స్పెషల్ కేటాయింపులు.
* మహిళపై లైంగిక దాడికి గురైతే..ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే..వెంటనే విచారణ జరిపి..21 రోజుల్లో మరణ శిక్ష. ఐపీసీ సెక్షన్‌లో మార్పులు.
* 7 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలి (డీఎన్ఏ..అన్నీ ఎవిడేషన్స్ పూర్తి)
* 14 వర్కింగ్ డేస్‌లో ట్రయల్ పూర్తి.
* ఆడవాళ్లు, చిన్నావారిపై వేధింపులు చేస్తే..లైంగిక వేధింపులు జీవిత ఖైదు.
* మహిళలపై సోషల్ మీడియా, ఇతర సామాజిక వేదికలపై వేధింపులు చేస్తే..మొదటిసారి చేస్తే..రెండు సంవత్సరాలు..రెండోసారి చేస్తే..నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.
* నేరాలకు పాల్పడిన వారి వివరాలు డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది.
* తమ ప్రభుత్వం మంచి పనులు చేయడానికి ముందుకొస్తోందని అందులో భాగంగా దిశ చట్టం రూపొందించడం జరుగుతుందని..అందరూ ఆశీర్వదించాలని సీఎం జగన్ తెలిపారు.
Read More : రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి – పవన్ కళ్యాణ్