Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్..

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె ..

illegal constructions Demolition

Vijayasai Reddy : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో సీఆర్ జడ్ నిబంధనల ఉల్లంఘనతో నిర్మాణాలు చేపట్టారు. సర్వే నవంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సుమారు నాలుగు ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు.

Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి మరింత గుర్తింపు.. సొంత డబ్బులు ఖర్చు చేస్తానని వెల్లడి

ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులతో రెండు వారాల క్రితమే అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టారు. స్టే ఇవ్వాలని నేహారెడ్డి కోర్టును కోరగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఆమెకు మరో షాకిచ్చింది. జీవీఎంసీకి కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలుజారీచేసింది. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహా రెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మరోసారి శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు.