రాజధాని ఆందోళనలు 27వ రోజు : పోలీసులకు సహాయ నిరాకరణ

  • Publish Date - January 13, 2020 / 06:29 AM IST

అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 13వ తేదీ సోమవారానికి 27 రోజులకు చేరుకున్నాయి. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాఠీఛార్జీ చేసినందుకు పోలీసులకు వాటర్ బాటిల్స్, టిఫిన్, భోజనాలు వారికి విక్రయించడం లేదు. వారికి ఎలాంటి విక్రయాలు చేయకూడదని దుకాణాల యజమానులు ఆదేశాలు ఇచ్చారు. రాజధాని ఆందోళనలో భాగంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు, ఆందోళనలతో హీట్ పెంచుతున్నారు. వెలగపూడి, కృష్ణయాపాలెంలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

గ్రామాల్లో 144 సెక్షన్‌ను ఇంకా అమలు చేస్తున్నారు. ర్యాలీలు, సభలకు ఎలాంటి అనుమతి లేదని, నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో అమరావతికి మద్దతుగా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటున్నారు. 

మరోవైపు అమరావతి పరిరక్షణ జేఏసీ జిల్లాల్లో ఆందోళనలు చేపడుతోంది. దీనికి టీడీపీ అధినే చంద్రబాబు హాజరవుతున్నారు. అందులో భాగంగా సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ సభలో బాబు పాల్గొంటారు. 
సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదుగా బళ్లారి బైపాస్‌కు చేరుకుంటారు. రాజధాని కోసం విరాళాలు సేకరిస్తారు బాబు. 
 

Read More : కంగ్రాట్స్ : తల్లి అయిన తర్వాత..టైటిల్ గెలిచిన సెరెనా విలియమ్స్