Deputy CM Pawan Kalyan
Operation Sindoor: పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే కేంద్రాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. అర్ధరాత్రి 1.05 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. ఆ 25 నిమిషాల్లోనే అంతా ఖతం.. కీలక విషయాలు వెల్లడించిన సైన్యం
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు గర్వించదగ్గ విషయం. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విజయం. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు గతంలో కశ్మీరీ పండిట్ లను చంపేశారు. దేశంలో దాడులు సీరియస్ గా తీసుకోవాలి. హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను పాక్ ప్రోత్సహిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నాం. భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదని పవన్ కల్యాణ్ అన్నారు.