Devineni Avinash: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాశ్

జోగి రమేశ్ అనుచరులు కుంచం జయరాం, కొండేపి వెంకట కోటేశ్వరరావు కూడా అరెస్ట్ అయ్యారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత దేవినేని అవినాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ముందుగా ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం బెయిల్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును అవినాశ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును వైసీసీ నేతలు రఘురాం, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు కూడా ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు.

మరోవైపు, ఈ కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేశ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును మంగళగిరి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

కొనసాగుతున్న అరెస్టులు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు రబ్బానిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేశ్ అనుచరులు కుంచం జయరాం, కొండేపి వెంకట కోటేశ్వరరావు కూడా అరెస్ట్ అయ్యారు.

Also Read: ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లలో కుట్ర కోణం బలపడుతోంది- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు