విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్ధం.. దేవినేని అవినాష్

సెటిల్మెంట్ వారసుడని నాపై నోరు పారేసుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్ల గురించి చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకుని చస్తారు.

devineni avinash challenge gadde ramamohan on vijayawada east development

Devineni Avinash open challenge: ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార, విపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆంధ్ర రాజకీయాలు కాకమీదున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఓపెన్ చాలెంజ్ విసిరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ నేత దేవినేని అవినాష్ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును చాలెంజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది జరిగిందని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిందేమీ లేదని అవినాష్ అన్నారు.

”రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది. రూ.650 కోట్ల అభివృద్ది తూర్పు నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ది జరగలేదు. గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి అక్కసు వెళ్లగక్కుతున్నారు. జగన్, దేవినేని నెహ్రుపై దిగజారి విమర్శలు చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన ప్లేస్‌కి వచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే ఏం అభివృద్ది చేశావో చెప్పాలి. సెటిల్మెంట్ వారసుడని నాపై నోరు పారేసుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్ల గురించి చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకుని చస్తారు. ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.

రిటైనింగ్ వాల్ టీడీపీ హయాంలో పూర్తి చేస్తే అక్కడకు నీళ్లెందుకు వచ్చాయి? నువ్వు రిటైనింగ్ వాల్ కట్టానని చెప్పుకుంటే ప్రజలు నీ మొహం మీద ఉమ్మి వేస్తారు. నీ మీద ప్రజలకు ఇప్పటికే విసుగెత్తి పోయింది. మేము చేసిన అభివృద్దిపై చంద్రబాబుతో అయినా చర్చకు సిద్ధం. మేము చేసిన అభివృద్ది సిగ్గు లేకుండా మీరే చేశానని చెప్పుకోవటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి భయంతో వణికి పోతున్నారు. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.పార్కుల్లో మీటింగ్‌లు పెట్టీ తమను విమర్శిస్తున్నారు. ఆ పార్కు కూడా అభివృద్ది చేసింది మేమే అని గుర్తుంచుకోవాలి. మీరు నడుచుకుంటూ వెళ్తున్న రోడ్ కూడా మేము వేసిందే అని గుర్తుంచుకోవాలి. మీ చేతకానితనం చూసి మీ ఇంటి చుట్టుపక్కల వారు కూడా తిట్టుకుంటున్నారు. అసెంబ్లీలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు కానీ నియోజకవర్గ సమస్యల మీద ఏరోజైనా మాట్లాడరా? కబుర్లు చెప్పటానికి తప్ప గద్దె రామ్మోహన్ దేనికి పనికిరాడు.

Also Read: చంద్రబాబు ఓపెన్ సవాల్‌పై ఫన్నీగా స్పందించిన మంత్రి అంబటి రాంబాబు

సిద్ధం సభలు చూసి టీడీపీ శ్రేణులు, దాని మిత్రపక్షాలకి మైండ్ బ్లాక్ అయింది. ప్రజలే ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెపుతారు. జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు. గంజాయి సప్లైకి మూల కారణం టీడీపీ. హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే. కాల్ మని, సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్. నీ బండారం అంతా త్వరలోనే బయట పెడతాం. గద్దె రామ్మోహన్ ఆస్తులపై నారా లోకేష్ వివరణ ఇవ్వాలి. చంద్రబాబు తన అక్రమ ఆస్తులు పేదలకు పంచాల”ని దేవినేని అవినాష్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు