చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్.. ఏమన్నారంటే..

సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన ఓపెన్ ఛాలెంజ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు.

చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్.. ఏమన్నారంటే..

Ambati rambabu

Updated On : February 19, 2024 / 12:28 PM IST

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అగ్రనేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం హీటెక్కింది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో కాక మరింత పెరిగింది. 2019లో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసిరారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను రెడీ అంటూ ప్రకటించారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాప్తాడు సభలో సీఎం జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈవిధంగా రెస్పాండ్ అయ్యారు.

కాగా, చంద్రబాబు చాలెంజ్‌పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

మరోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని అంబటి రాంబాబు దీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలకు తరలివస్తున్న జనాన్ని చూస్తుంటే వైసీపీ విజయం కళ్లముంగిట కనబడుతోందని పేర్కొన్నారు. “వైసీపీ గెలుపు సిద్ధంతో అద్దంలా కనపడుతుంద”ని ట్వీట్ చేశారు. కాగా, ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు చూస్తుంటే మున్ముందు రాజకీయం మరింత హీటెక్కే అవకాశముందని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

 

Also Read: దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా..! మరోసారి ట్విటర్ వేదికగా జగన్‌కు చంద్రబాబు సవాల్