Devineni Chandrasekhar
టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజులుగా చంద్రశేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు.
చంద్రశేఖర్‌కు గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లకు చంద్రశేఖర్ మృతదేహాన్ని తరలించారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Chandrababu Naidu: ఎన్డీయేలోకి రావాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం?