ఎన్డీయేలోకి రావాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం?

ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..

ఎన్డీయేలోకి రావాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం?

Chandrababu Naidu

Updated On : February 8, 2024 / 10:09 AM IST

Chandrababu Naidu: కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీలో సమావేశమై పొత్తులపై చర్చించారు. ఎన్డీయేలో చేరాలని టీడీపీని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం. ఎన్డీయేకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని షా అన్నారు. పార్టీ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయ పరిస్థితులపై ముగ్గురు నేతలు చర్చించారు.

ఏపీని పునర్నిర్మించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగింది. మరోవైపు, బీజేపీ అధిష్ఠానం పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరిపిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది. చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే చంద్రబాబు – పవన్ చర్చలు జరిపారు. టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ కలిస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై మూడుపార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీలోని అధికార వైసీపీ ఇప్పటికే జాబితాలను ప్రకటిస్తోంది.

Also Read: చంద్రబాబును కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు