Devineni Uma: ఇంటి మీద ఏడుపు ఎందుకు? వారంతా అనుభవిస్తారు: దేవినేని ఉమ వార్నింగ్

"జగన్ చేసే తప్పుడు పనులకు ఎవరు భాగస్వాములు అవుతున్నారో.. వారంతా.." అంటూ దేవినేని ఉమ పలు వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma Maheswara Rao

TDP: ఏపీ సీఎం జగన్ కొత్త నాటకానికి తెర లేపారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విజయవాడలో ఉంటున్న అద్దె ఇంటిని అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

“ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్.. క్విడ్ ప్రోకో అంటూ జగన్ రకరకాల విన్యాసాలు మొదలు పెట్టారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. దీంతో జగన్నాటకానికి తెర తీశారు. చంద్రబాబు ఆ ఇంట్లో ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ప్రజా వేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాశారు.. ఆ తర్వాత ప్రజా వేదికను కూల్చారు.

అటాచ్‌మెంట్ పేరుతో డ్రామాలాడితే జనం నమ్మరు. పక్క రాష్ట్రంలో జగన్ ఆస్తులు డోలాయమానంలో పడ్డాయి. బాబాయ్ హత్య కేసు విషయంలో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు. రాని, లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో జరిగిపోయిందని జగనుకు కలలు వచ్చాయి. చంద్రబాబును ఏమీ చేయలేరు.

చంద్రబాబు జాతి సంపద. తాడేపల్లి కొంపకు ఎన్ని అనుమతులు ఏడ్చాయి. చంద్రబాబు ఉంటున్న ఇంటి మీద ఏడుపు ఎందుకు? అమరావతి రైతులు.. మహిళల పోరాటం జగన్ను భయపెడుతున్నాయి. జగన్ చేసే తప్పుడు పనులకు ఎవరు భాగస్వాములు అవుతున్నారో.. వారంతా అనుభవిస్తారు.

కోర్టుల్లో చాలా మంది ఐఏఎస్ అధికారులు తలొంచుకుని నిలబడుతున్నారు. చేతనైతే తడిచిన ధాన్యాన్ని కొనండి. రైతులను దోపిడీ చేసిన దళారుల నుంచి దోపిడీ సొమ్ము కక్కించండి. జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లుతోంది. జగన్ రెడ్డీ పనైపోయింది” అని దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

Buddha Venkanna : వివేకా హత్య కేసు నుంచి జగన్, అవినాష్ రెడ్డి బయటపడడం అసాధ్యం : బుద్దా వెంకన్న