Tirumala Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని టికెట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.

Tirumala Sarva Darshanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం సామాన్య భక్తులకోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

కానీ శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని సర్వదర్శనం  టికెట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. శ్రీనివాసం వసతి సముదాయం నుంచి భక్తులను వెనక్కి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోకెన్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. భక్తుల ఆందోళనతో శ్రీనివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు.

Also Read : ఆన్‏లైన్‏లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు

కాగా…..సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు