దర్శకుడు బోయపాటి ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం నెలకొంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న

  • Publish Date - January 17, 2020 / 03:22 PM IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం నెలకొంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం నెలకొంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం(జనవరి 17,2020) రాత్రి 7.22 గంటలకు తుది శ్వాస విడిచారు. బోయపాటి సీతారావమ్మ వయసు 80 ఏళ్లు. స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో మరణించారు. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని వెళ్లారు.

పలువురు టాలీవుడ్ ప్రముఖులు బోయపాటికి సంతాపం తెలిపారు. బోయపాటి తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Also Read : మహేష్, బన్నీ బాహుబలిని బీట్ చేశారా!