Raghavendra Rao : చంద్రబాబు అరెస్టు, ఏపీలో అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడుతున్నాయి : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.

Chandrababu arrest..Director Raghavendra Rao

Director K.Raghavendra Rao :  టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన ఘటనను అరెస్ట్ చేసిన విధానాన్ని టీడీపీ నాయకులు, ఆయన మద్దతుదారులు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టులతో పాటు ప్రజాసంఘాల నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సహా పలువురు చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండిచారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ పై ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని.. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమన్నారు. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయంటూ ట్విట్టర్ వేదికగా దర్శకేంద్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇక టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేయకుండా ఎక్కడిక్కడే పోలీసులను భారీగా మోహరించారు. అయినా పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

Also Read: చంద్రబాబు అరెస్ట్.. ప్రత్యేక విమానంలో అమరావతికి పవన్ కళ్యాణ్

ట్రెండింగ్ వార్తలు