Disha App: దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఎలా వాడాలంటే?

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ మహిళల భద్రత కోసం కొత్త యాప్ అభివృద్ధి చేసింది.. అదే.. Disha App.. ఈ యాప్ అధికారికంగా లాంచ్ అయింది. దిశ యాప్ డౌన్‌లోడ్ కోసం Google Play స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Disha Women Safety Mobile App : ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ మహిళల భద్రత కోసం కొత్త యాప్ అభివృద్ధి చేసింది.. అదే.. Disha App.. ఈ యాప్ అధికారికంగా లాంచ్ అయింది. రాష్ట్రంలోని ప్రతి మహిళ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. దిశ యాప్ డౌన్‌లోడ్ కోసం Google Play స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం.. దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. IOS యాప్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దిశా యాప్ వినియోగదారు లొకేషన్ ట్రాకింగ్‌కు GPS ద్వారా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక పోలీసులను, అధికారులను అలర్ట్ చేస్తుంది. యాప్ అందించిన సమాచారంతో పోలీసులు, సంబంధిత అధికారులు కేవలం 6 నిమిషాల వ్యవధిలో అత్యవసర ప్రదేశానికి చేరుకోగలరు.

దిశ యాప్ ఎలా వాడాలంటే? :
దిశ యాప్ వాడాలంటే.. యూజర్లు తమ మొబైల్ డివైజ్ లో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్‌ షేక్ చేయాలి. మొబైల్ డివైజ్ జీపీఎస్‌ను ఆటోమాటిక్ గా ఆన్ చేస్తుంది. ఆపై పుష్ బటన్ మెసేజింగ్ సిస్టమ్ సాయంతో అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేస్తుంది. దిశ యాప్ సమీప, భద్రతా స్థలాలు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన కాంటాక్టులు సహా మరిన్ని ఫీచర్లతో ఇంటిగ్రేడ్ అయి ఉంటుంది.

మహిళా భద్రతా యాప్ ద్వారా పోలీసు అధికారులు కాలర్‌ను త్వరగా ట్రాక్ చేయొచ్చు. ఇందులో ట్రాకింగ్ భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. సాయం కోసం యూజర్లు డయల్ 100 లేదా ఇతర హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడానికి SOS ఎంపికపై క్లిక్ చేయవచ్చు, అక్కడ యూజర్ సెంట్రల్ కాల్ సెంటర్‌కు, ఆ తరువాత సమీప పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుంది.

దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేయండిలా :
– యాప్.. Android యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
– దిశ యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి.
– దిశ యాప్ కోసం సెర్చ్ చేయండి.
– మీ మొబైల్ డివైజ్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
– ఒకసారి ఇన్‌స్టాల్ చేశాక యాప్ సెటప్ చేయండి.
– మీ పేరు, వయస్సు, లింగం, చిరునామా వివరాలను ఎంటర్ చేయండి.
అంతే.. దిశ యాప్ రెడీగా ఉన్నట్టే.. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు