Divyavani Resigns TDP : టీడీపీకి షాక్ ఇచ్చిన దివ్యవాణి..!

టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు.

Divyavani Resigns TDP : టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని, తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే, కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు. అంతేకాదు తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదంటూ యూటర్న్ తీసుకున్నారు దివ్యవాణి.

Chandrababu On Mahanadu : మహానాడు సక్సెస్ అయిందన్న చంద్రబాబు, దూకుడు పెంచాలని పిలుపు

మహానాడులో తనకు మాట్లాడే అవకాశం రాకపోవడంతో దివ్యవాణి అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన పోస్ట్ ఆధారంగా తాను రాజీనామా చేశానంటున్నారు దివ్యవాణి. ఇంతలో.. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో మరో పోస్ట్ పెట్టారు. ఈ పరిణామాలతో కలత చెందిన దివ్యవాణి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అయితే, తాము దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని టీడీపీ తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న దివ్యవాణి తన ట్విట్ ను వెంటనే డిలీట్ చేశారు.(Divyavani Resigns TDP)

Atchennaidu On Jagan Ruling : అప్పులు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి సీఎం అవసరం లేదు- జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ ఫైర్

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన దివ్యవాణి.. ఆమెకున్న సినీ గ్లామర్ తో పార్టీలోనూ, ప్రజల్లోనూ మరింత ఇమేజ్ సంపాదించారు. టీడీపీ కూడా ఆమెకు ప్రాధాన్యత కల్పించడంతో ప్రత్యర్థి పార్టీలు, మంత్రులు టార్గెట్ గా ఆమె ఘాటైన విమర్శలు చేశారు. అమరావతి రైతు ఉద్యమం, పాదయాత్రలో సైతం దివ్యవాణి క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు.

Atchennaidu On Early Elections : ముందస్తు వచ్చే అవకాశం, 160 సీట్లు గెలుస్తాం-అచ్చెన్నాయుడు

ఇదే సమయంలో కొందరు కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ దివ్యవాణి ఆదేదన వ్యక్తం చేశారు. మహానాడు జోష్ లో ఉన్న టీడీపీలో దివ్యవాణి చేసిన కామెంట్లు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. అనంతరం దివ్యవాణి రాజీనామాపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు ఓ ఫేక్ పోస్టింగ్ సర్కులేట్ అయ్యింది. దాన్ని చూసి ఆవేశంతో దివ్యవాణి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ బచ్చుల అర్జునుడు.. దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని క్లారిటీ ఇవ్వడంతో.. ట్విట్టర్ వేదికగా తాను చేసిన ట్వీట్ ను దివ్యవాణి తొలగించారు. కాగా, తన రాజీనామా అంశంపై దివ్యవాణి క్లారిటీ ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు