Atchennaidu On Jagan Ruling : అప్పులు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి సీఎం అవసరం లేదు- జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ ఫైర్

ఈ ప్రభుత్వం.. విధ్వంసంతో పాలన ప్రారంభించింది. రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్ల పాటు వెనక్కు వెళ్లింది. బాదుడు నుంచి విముక్తి రావాలంటే చంద్రన్న రావాలి. (Atchennaidu On Jagan Ruling)

Atchennaidu On Jagan Ruling : అప్పులు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి సీఎం అవసరం లేదు- జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ ఫైర్

Atchennaidu

Atchennaidu On Jagan Ruling : జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలోని టీడీపీ ఆఫీస్ లో మీడియా సమావేశంలో.. జగన్ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు అచ్చెన్నాయుడు.

ఒక దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మూడేళ్ల మోసకారి పాలనలో నేరాలు, ఘోరాలు, దోపిడీలు, విధ్వంసాలు, సామాజిక విద్రోహాలు, రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్ల పాటు వెనక్కు వెళ్లిందన్నారు. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అచ్చెన్నాయుడు నినదించారు. బాదుడు నుంచి విముక్తి రావాలంటే తిరిగి చంద్రన్న రావాలి అంటూ చార్జ్ షీట్ విడుదల చేశారు అచ్చెన్నాయుడు.

Chandrababu On Mahanadu : మహానాడు సక్సెస్ అయిందన్న చంద్రబాబు, దూకుడు పెంచాలని పిలుపు

ఈ ప్రభుత్వం.. విధ్వంసంతో పాలన ప్రారంభించిందని, ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంచిగా ఉన్న ఇంటిని కూల్చి వాటికి పరిహారం ఇస్తున్నామని చెప్పుకోవడం దారుణం అన్నారు. రొటీన్ గా జరిగే పథకాలను కూడా ఆయనే చేస్తున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు.(Atchennaidu On Jagan Ruling)

‘జగన్ పాలనలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రాన్ని రివర్స్ లోకి తీసుకెళ్లారు. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా సొంత మనుషులతో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఉండేదని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ఏపీ కళకళలాడేదన్నారు. గతంలో విశాఖకు పారిశ్రామిక వేత్తలు వచ్చేవారని.. ఇప్పుడేమైందని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విధ్వంసం చేశారని.. ఒక్క ప్రాజెక్టు అయినా ఇక్కడికి వచ్చిందా? అని అచ్చెన్న నిలదీశారు.(Atchennaidu On Jagan Ruling)

చంద్రబాబు పాలను బాదుడే బాదుడే అని విమర్శించిన జగన్ ఇప్పుడు వీర బాదుడు బాదుతున్నారు. సెస్ తగ్గించమని కేంద్రం చెప్పినా జగన్ తగ్గించ లేదు. దేశంలో ఏపీలోనే చార్జీలు ఎక్కువ. నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం ఏమిటి? విపక్ష పార్టీల నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీశారు. ఇంటింటికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తుంటే పెరిగిన చార్జీల గురించి నిలదీస్తున్నారు.(Atchennaidu On Jagan Ruling)

ధర్మాన ప్రసాదరావు ఒక మంత్రేనా? అప్పులు తెచ్చి మీట నొక్కి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. రాష్ట్రంలో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారని చెబుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 10 మంది మంత్రులు కావడం గొప్పా? 100 గెలిచి 9 మంత్రులు ఇవ్వడం గొప్పా? పేరుకే బీసీ మంత్రులు.. పెత్తనమంతా ఆ నలుగురు చేతుల్లో ఉంది. బీసీలపై జరుగుతున్న అక్రమాలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? మేము బీసీ కులాలకు న్యాయం జరగాలని స్వయం ఉపాధి కల్పన కోసం పరికరాలు కొంటే కనీసం వాటిని పంచేందుకు లేదు.

Atchennaidu On Early Elections : ముందస్తు వచ్చే అవకాశం, 160 సీట్లు గెలుస్తాం-అచ్చెన్నాయుడు

వైసీపీ మంత్రుల బస్సు యాత్ర పూర్తిగా ఫెయిల్. చంద్రబాబు బీసీలకు రాజ్యసభ సీట్ల ఇచ్చారా? అని అడుగుతున్నారు? ముద్దాయిలుగా ఉన్న వారికి, జగన్ కేసులు వాదించిన వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు. మరొకటి బీసీ నేత అని చెప్పుకొన్న మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజ్యసభకు అర్హులైన వాళ్లే లేరా?

రైతుల ఆత్మహత్యలు మన రాష్ట్రంలో ఎక్కువ అని నివేదికలు ఇస్తున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, స్పింక్లర్ ఇరిగేషన్ కు కనీసం ఒక్క రూపాయి ఇచ్చారా? మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టారా? కనీసం బాధితులను పరామర్శించారా? రాష్ట్రంలో వైద్య రంగం ఉందా..? విద్యా వ్యవస్థ నాశనం చేశారు. నాడు నేడు పేరుతో రూ.5 వేలు కోట్లు దోపిడీ జరిగింది. రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ ఎత్తేశారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. 30 లక్షల ఇల్లు కడతామని చెప్పారు. కేవలం 3 ఇళ్లు కట్టారు. ఇసుక, సిమెంట్ ధరలు పెంచారు.(Atchennaidu On Jagan Ruling)

సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి సొంత మద్యం బ్రాండ్లు, కంపెనీలు పెట్టారు. ప్రజలు నాసిరకం మందు తాగి మరణిస్తున్నా కనీసం స్పందన లేదు. ప్రతి క్వార్టర్ బాటిల్ పై 20 రూపాయలు దోచుకుంటున్నారు. మద్యం జగన్ అమ్ముతూ ఇసుక ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు. దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి ఏం తెచ్చారో చెప్పాలి. అదానీని కలవడానికి దావోస్ వెళ్లాల్సిన పనేంటి? ఢిల్లీలోనే కలవొచ్చు కదా. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. కనీసం ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? మాదకద్రవ్యాలు, గంజాయికి ఏపీని హబ్ గా చేశారు” అని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు.