Vizag Kidney Racket : విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో డాక్టర్ రాజశేఖర్ దారుణాలు

డాక్టర్ల ముసుగులో మనిషి అవయవాలను ఏదో వస్తువుల్లా అమ్మేస్తున్నారు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ దారుణాలు అన్నీ ఇన్నీ కావు.

visakha kidney racket case

Vizag Kidney Racket : ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే కిరాతకంగా మనిషి అవయవాలను అమ్మేసుకుంటున్న దారుణాలు మానవత్వం చచ్చిపోయిందా అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి. డాక్టర్ల ముసుగులో మనిషి అవయవాలను ఏదో వస్తువుల్లా అమ్మేస్తున్నారు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్న క్రమంలో ఈకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ తో పాటు దళారీగా వ్యవహరించే వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమల ఆస్పత్రిలో వినయ్ కుమార్ కిడ్నీని తొలగించి అమ్మేసుకున్న డాక్టర్ రాజశేఖర్ పాల్పడే దారుణాలు అన్నీ ఇన్నీకావు. హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో కన్సల్టెంట్ గా పనిచేసే డాక్టర్ రాజశేఖర్ తన వృత్తికే కళంకంగా మారారు. తనకున్న పరిధిని..పరిచయాలను అక్రమార్జన కోసం వినియోగిస్తు ఆయా ఆస్పత్రుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక సమ్యలు ఉండే రోగులను టార్గెట్ గా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్ ద్వారా దారుణాలు చేస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్ట్ ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంకా ఈకేసులో మరింతమంది బయటపడే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

Vizag Kidney Racket : మద్యం తాగించి నా కిడ్నీ దొబ్బేశారు

విశాఖ పెందుర్తి కిడ్నీ రాకెట్ గుట్టురట్టు నప్పటినుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి డబ్బులు ఆశ పెట్టటం, వాహనాలు ఆశ ఉన్నవారికి వాహనాలు కొని ఇస్తామనటం, మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం పోసి కిడ్నీలను కొట్టేయటం ఇలా కిడ్నీ రాకెట్ కేటుగాళ్లు కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. అలా విశాఖలో కిడ్నీల ముఠా కిడ్నీలను అమ్మేసుకుంటున్న ముఠాలల్లో నిందితులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీంట్లో భాగంగా కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్న క్రమంలో ఈకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ తో పాటు దళారీగా వ్యవహరించే వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దారుణంలో మరో దారుణం ఏంటంటే..కిడ్నీ ఇస్తే మీకు కావాల్సింది ఇస్తాం అంటూ ఆశపెట్టి కిడ్నీ ఇచ్చేలా ఒప్పించటం నుంచి దళారీల దందా మొదలవుతుంది. వారి అవసరాలు ఏంటో తెలుసుకుని వాటిని ఇస్తామని ఆశపెడుతుంటారు. అలా కిడ్నీ ఇచ్చేలా ఒప్పించి తీరా డబ్బులు ఇచ్చే సమయంలో ఏవో మాయ మాటలు చెప్పి నామమాత్రంగా డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు కిడ్నీ రాకెట్ ముఠాలోని కామరాజు, ఎలీనా, శ్రీను అనే వ్యక్తులు. దీంతో బాధితులు మాకు ఇస్తానన్న డబ్బుల ఇవ్వలేదంటూ అమాయంగా చెబుతున్నారు బాధితులు. అలా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ ముఠా చేసే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. దీంట్లో డాక్టర్లది ప్రధాన పాత్రగా ఉండటం అత్యంత దారుణమైన విషయం. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు కిరాతకంగా మనిషి అవయవాలను వస్తువుల్లా అమ్మేసుకుంటు అక్రమార్జలకు పాల్పడుతున్నారు.

Kidney Racket : విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. రూ.8,50,000 ఇస్తామంటూ కిడ్నీ తీసుకుని మోసం