Treatment For Chandrababu In Jail
Treatment For Chandrababu In Jail : స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో డాక్టర్లు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చర్మ సంబంధ సమస్యలతో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత.. వాతావరణ మార్పుల వల్ల ఇటీవల డీహైడ్రేషన్ కు కూడా గురయ్యారు. తాజాగా స్కిన్ అలర్జీ కూడా రావడంతో ప్రత్యేకంగా డెర్మటాలజిస్టులను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read : చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని అమిత్ షా చెప్పారు : నారా లోకేశ్
చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైల్లోనే ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశామని జైలు అధికారులు చెప్పారు. జైల్లో డాక్టర్లు ఉన్నా.. స్కిన్ అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నట్లు తెలియగానే..ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేందుకు నిపుణులైన డెర్మటాలజిస్టులను పిలిపించి చంద్రబాబుకి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు జైలు అధికారులు. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకి స్కిన్ అలర్జీ వచ్చినట్లుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. గత 32 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు తెలియగానే.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డెర్మటాలజీ నిపుణులను జైలుకి పిలిపించారు జైలు అధికారులు. వారితో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు డెర్మటాలజిస్టులు జైలు లోపలికి వెళ్లారు. చంద్రబాబుకి వైద్యం అందిస్తున్నారు.