Buddha Venkanna: పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. వాళ్లు కలిసినప్పుడు.. వీళ్లు కలిస్తే తప్పేంటి?

ట్టసభల్లో ఏ రోజు లేని సజ్జలకు ఏం తెలుసని చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదన్నారు.

Buddha Venkanna: పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. వాళ్లు కలిసినప్పుడు.. వీళ్లు కలిస్తే తప్పేంటి?

Buddha Venkanna and Daggubati Purandeswari

Updated On : October 12, 2023 / 12:35 PM IST

TDP Leader Buddha Venkanna : చంద్రబాబును జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.. కావాలనే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాల పుట్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి నారా లోకేశ్ అన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.. లోకేష్ ను దగ్గరుండి అమిత్ షా దగ్గరకి తీసుకెళ్లారు. రాష్ట్రంలో లిక్కర్ స్కాం గురించి పురంధేశ్వరి మొత్తం చెప్పిందని బుద్ధా అన్నారు.

Read Also : Minister KTR : కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు.. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

సీఎం జగన్ విశాఖపట్టణం వస్తుంటే అక్కడి ప్రజలు గడగడలాడిపోతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. గతంలో విజయమ్మ ఓడినచోట తిరిగి ఎంపీగా పోటీచేసి గెలిచే సత్తా ఉందా..? లోకేశ్ మంగళగిరిలో గెలుస్తాడని సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ కలిశారని వైసీపీ నేతలు కంగారుపడిపోతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి కలవలేదా? చంద్రబాబు, పవన్ కలిస్తే మీకేంటి అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబును జైల్లో పెట్టి శునకానందం పొందుతున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : BRS Petition : కారును పోలిన గుర్తులు ఏ పార్టీకి కేటాయించకూడదంటూ.. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు

రెండెకరాలతో వ్యవసాయం చేసి వచ్చిన ఫ్యామిలీ చంద్రబాబుది.. చట్టసభల్లో ఏ రోజు లేని సజ్జలకు ఏం తెలుసని చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదన్నారు. చంద్రబాబుపై దొంగ అని ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సభకు జనాల్ని తోలుకొచ్చే పరిస్థితికి మీరు వచ్చారంటూ విమర్శించారు. సీఎం జగన్ కు మొరిగే కుక్క కొడాలినాని.. పెద్ద ఎన్టీఆర్ కు దత్తపుత్రుడులా ఆయన మాట్లాడుతున్నాడు. ఖాకీ ప్యాంటు, చొక్కా వేసుకొని గేటు దగ్గర ఉండి చెప్పులు విసిరింది కొడాలి నాని అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు.