BRS Petition : కారును పోలిన గుర్తులు ఏ పార్టీకి కేటాయించకూడదంటూ.. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు

గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు, జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కంటే అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించవద్దని, తద్వారా బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.

BRS Petition : కారును పోలిన గుర్తులు ఏ పార్టీకి కేటాయించకూడదంటూ.. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు

BRS Petition Delhi High Court

BRS Petition – Delhi High Court : కారును పోలిన గుర్తు కేటాయింపుపై బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ కోరిక మేరకు 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించినప్పటికీ తిరిగి చేర్చటంపై అభ్యంతరం తెలుపుతూ ఆ గుర్తును తొలగించాలని కోరింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించవద్దని కోరింది.

Minister KTR : కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు.. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

కెమెరా, చపాతి, రోలర్, రోడ్డు రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులను రానున్న ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు, జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కంటే అధిక ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించవద్దని, తద్వారా బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కాగా, బీఆర్ఎస్ విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది.