AP Junior Doctors : ఏపీలో మోగనున్న జూ. డాక్టర్ల సమ్మె

Doctors Give Strike Notice : కరోనా వేళ వైద్యులు సమ్మెకు దిగుతుండడం..ఆందోళన కలిగిస్తోంది. తమ సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తూ..విధులకు బహిష్కరిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా..ఏపీ రాష్ట్రంలో డాక్టర్ల సమ్మె సైరన్ మ్రోగనుంది. ప్రభుత్వానికి సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె నోటీసులు అందించారు. 2021, జూన్ 09వ తేదీ నుంచి అన్ని విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసులో వెల్లడించారు.

09, 10వ తేదీల్లో కోవిడ్ కు సంబంధం లేని విధులు బహిష్కరించనున్నట్లు, 11,12 వ తేదీల్లో కోవిడ్ కు సంబంధం లేని అత్యవసర విధులను బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. తమకు ఆరోగ్య బీమా, ఎక్స్ గ్రేషియా కల్పించాలని డాక్టర్లు కోరుతున్నారు. ఎస్‌ఆర్‌కు అందించే స్టయిఫండ్, టీడీఎస్ కటింగ్ లేకుండా చూడాలని, అలాగే వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్ కు అవకాశం కల్పించాలంటున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More : Visakha Excise Scam : ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్.. రూ.33లక్షలు నొక్కేశారు

ట్రెండింగ్ వార్తలు