Minister Venugopala Krishna : మిస్సింగ్‌కి ట్రాఫికింగ్‌కి తేడా కూడా తెలియనోడు- పవన్ కల్యాణ్‌పై మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ

Minister Venugopala Krishna : సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అందుకే 175 అంటున్నారు. ఏపీ ఇమేజ్ ను తగ్గించేలా పవన్ మాటలు ఉన్నాయి.

Chelluboina Srinivasa Venugopala Krishna (Photo : Google)

Chelluboina Srinivasa Venugopala Krishna : వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఏపీ రాజకీయాల్లో రచ్చకు దారితీశాయి. పవన్ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాటల యుద్ధానికి దిగారు. పవన్ మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాజాగా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. పవన్ సైకోలా మాట్లాడుతున్నాడు అని ధ్వజమెత్తారు.

” వైసీపీ రాదు అంటున్న పవన్ ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో చెప్పాలి. మొన్నటి వరకూ రాష్ట్ర నాయకుడు అన్నాడు ఇప్పుడు రెండు జిల్లాల నాయకుడు అయ్యాడు. రానున్న రోజుల్లో రెండు సీట్లకు వచ్చేస్తాడు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేది ప్రజలు. పవన్ కాదు నిర్ణయించడానికి.
పవన్ భ్రమల్లో ఉన్నాడు. చంద్రబాబు ట్రాప్ లో ఉన్నాడు. సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అందుకే 175 అంటున్నారు.

Also Read..Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మిస్సింగ్ కి, ట్రాఫికింగ్ కి తేడా పవన్ కు తెలియదు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ పతనం అయ్యాడు. సైకోలా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని రెండవ విడత వారాహి యాత్ర మొదలుపెట్టాడు. ఏపీ ఇమేజ్ ను తగ్గించేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ భార్యను ఎవరూ ఏమీ అనలేదు. సానుభూతి కోసం చెప్తున్నాడు.

Also Read..Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

పవన్ కుటుంబసభ్యులను తిట్టింది టీడీపీ నేతలు. వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. నిఘా సంస్థలు పవన్ కు ఎందుకు చెప్తాయి.? హైదరాబాద్ లో డేటా ఉందని అంటున్నాడున. అందుకు ఆధారాలు చూపించాలి” అని మంత్రి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.