‘అనుమతులున్నా ప్రభుత్వం వేధిస్తోంది’… స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందన

  • Publish Date - August 18, 2020 / 10:34 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందించారు. తమ వద్ద అన్ని అనుమతులు వున్న ప్రభుత్వం వేధిస్తోందని ఆమె అన్నారు. రమేష్ బాబుకు కులం పేరు అంటగట్టి దుష్పప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ప్రైవేటు కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమయం వచ్చినప్పుడు రమేషే స్వయంగా వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై పోలీసులు తనను విచారన్న శైలజ.. కోవిడ్ సెంటర్ కు తాను 7,8 నెలలుగా వెళ్లలేదని చెప్పారు.



స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విజయవాడ పోలీసులు గుంటూరులో కూడా విచారణ చేపట్టారు. ఇటు రాయపాటి సోదరుడి కుమార్తె అయిన డా. రాయపాటి శైలజను కూడ ఈ రోజు పోలీసులు విచారించారు. అయితే ఆమెను ఇంటివద్ద విచారణ చేస్తామని చెప్పి పోలీసులు విజయవాడ రావడంతో ఆమె రమేష్ హాస్పిటల్ వచ్చి స్వయంగా చూస్తా అని చెప్పింది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లో ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగింది. కావాలని తమ పైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.



రాయపాటి శైలజ
‘చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న వైజాగ్ లో….అంతకముందు వేరే చోట ఫైర్ యాక్సిండెట్లు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఇంతగా వేధించ లేదు. నిజంగా ఏమన్నా ఉంటే గనుక ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా రమేష్ అందుబాటులోనే ఉన్నారు. కలెక్టర్ మీటింగ్ కు వెళ్లారు. అన్ని పర్మిషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన 30 సంవత్సరాలుగా తెచ్చుకున్న పేరు ప్రతిష్టలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. ఒక కులం పేరుతో, పేరులో లేని చౌదరిని కలిపి ఆయన ఇమేజ్ ను నాశనం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కావాలని చేస్తున్నట్లే ఉంది’ అని ఆమె అన్నారు.