Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Chintamani Natakam :  ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు కించపరుస్తోందనే కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి సాంఘిక నాటకం  ప్రదర్శనపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

చింతామణి నాటక ప్రదర్శన ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని, అటువంటి నాటకం‌పై నిషేధం విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు
ఎక్కడైనా అశ్లీలం,అసభ్యత ఉంటే వాటిని తొలగిస్తామని, అంతేగాని నిషేధం విధిస్తే తమ ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కళాకారులు కోరారు.

ట్రెండింగ్ వార్తలు