పవన్ కల్యాణ్ పర్యటనలో డ్రోన్ కెమెరా కలకలం.. ఎవరు పంపారు, ఎందుకు పంపారు?

డ్రోన్ కెమెరాను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం పంపారు? అనేది తెలుసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. తోగురుపేట – పులపత్తూరుకు మధ్యలో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. పవన్ కల్యాణ్ పాల్గొనే సభ వద్ద కూడా డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read : వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

ఇవాళ ఉదయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని గ్రామాలు తిరిగారు. తోగురుపేట-పులపత్తూరు ప్రాంతాల్లో సభలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ డ్రోన్ కెమెరా ఎగరడం, అక్కడున్న పరిస్థితులను షూట్ చేయడం కలకలం రేపింది. అసలు ఆ డ్రోన్ కెమెరాను ఎవరు ఎగురవేశారు? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. పవన్ పాల్గొనే సభ వద్ద కూడా ఈ డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. డ్రోన్ కెమెరాను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం పంపారు? అనేది తెలుసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

డ్రోన్ కెమెరా ఎగరవేయడం, మళ్లీ సడెన్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పాల్గొనే సభాస్థలి వద్ద డ్రోన్ కెమెరా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారం అధికారులను ఆందోళనకు గురి చేసింది. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ఎగురవేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.