Gannavaram
Gannavaram Airport : కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్ వేను దుప్పటిలా పొగమంచు కప్పేసింది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విమానాల టేకాఫ్, టేకాన్ లకు ఇబ్బంది కలుగుతుంది. పొగ మంచు కారణంగా ల్యాండింగ్ కు ఇబ్బంది కావడంతో హైదరాబాద్ నుండి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.