Vij
Durga Gudi Flyover : దుర్గగుడి ఫ్లైఓవర్‌పై.. బైక్ స్టంట్స్ చేసిన యువకులపై బెజవాడ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆకతాయి యువకులు యాక్షన్ చేస్తే.. పోలీసులు దానికి రియాక్షన్ చూపించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతుండటం.. కొందరు యువకులు బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌పై నిలబడి గన్‌తో కాల్చుతూ హడావుడి చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఇద్దరు యువకుల విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఘటనపై సీరియస్ అయ్యారు విజయవాడ సీపీ శ్రీనివాసులు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలంటూ ఆదేశాలిచ్చారు. సీపీ ఆదేశాలతో.. ఇద్దరు యువకులను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. వారికి, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి చేష్టలే చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించి మరీ ఇంటికి పంపారు.
Read More : Wife Kidnapped Her Husband : విడాకులు కోసం ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేసిన భార్య
ఫోటో షూట్ పేరుతో ఈ విన్యాసాలు చేసినట్లుగా గుర్తించారు. యువకులు బొమ్మ తుపాకీతో విన్యాసాలు చేశారంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా.. అందులో ఉన్న యువకులను గుర్తించారు పోలీసీలు. బైక్ స్టంట్స్ చేసిన యువకులను.. వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థులు ఎవరూ బైక్ రేస్‌లకు పాల్పడవద్దని.. బైక్ రేస్‌లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Read More : AP YCP : రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ..వివాదానికి ఫుల్ స్టాప్!
బైక్ రేసర్లకు దుర్గ గుడి ఫ్లైఓవర్ రేసింగ్ ప్లేస్‌గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు యువకులు దుర్గగుడి ఫ్లై ఓవర్ పై బైక్ పై రేసింగ్ స్టంట్స్ చేశారు. కెటిఎమ్, పల్సర్ 220 బైక్‌ల నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై రచ్చ చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్తున్న వాహనదారులు వారి బైక్ స్టంట్స్ చూసి భయపడిపోయారు.