AP YCP : రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ..వివాదానికి ఫుల్ స్టాప్!

రాజానగరం ఎమ్మెల్యే, రాజమండ్రి మార్గాని ఎంపీ భరత్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

AP YCP : రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ..వివాదానికి ఫుల్ స్టాప్!

Raja

YCP Rajahmundry : రాజమండ్రి వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలతో.. వైసీపీలోని ఇన్ సైడ్ వార్.. అవుట్‌సైడ్‌లో బరస్ట్ అవడం.. రాజానగరం ఎమ్మెల్యే, రాజమండ్రి మార్గాని ఎంపీ భరత్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. భరత్, జక్కంపూడి రాజా మధ్య భగ్గుమన్న విభేదాలు.. అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఆవ భూములకు సంబంధించి విమర్శలు.. ఆర్ధిక లావాదేవీలు.. స్థానిక సమస్యలు ఇలా పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

Read More : భారత్‎లోకి ఎంటరైన చైనా ఆర్మీ… భారత సైన్యం ఆగ్రహం

ఇద్దరి వ్యవహారంపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ అధిష్టానం.. దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. వెంటనే ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి, సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపింది. ఎలాగైనా వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడేలా చూడాలంటూ ఆదేశించింది వైసీపీ హైకమాండ్‌. దీంతో.. ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజాను విజయవాడకు పిలిపించారు. వారిద్దరు వైవీ.సుబ్బారెడ్డితో సమావేశమ్యారు. వివాదంపై ఎవరి వాదన వారు వినిపించారు.

Read More : Love Story : 50 ఏళ్ళ తర్వాత అదే డేట్ కి నా కొడుకు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు : నాగార్జున

వైవీ. సుబ్బారెడ్డి విడివిడిగా కూడా వీరితో మాట్లాడారు. ఇద్దరి వైఖరిపై సీఎం జగన్ కూడా అసంతృప్తితో ఉండటంతో.. ఇద్దరినీ సీఎం దగ్గరకు వైవీ తీసుకెళ్లారని తెలుస్తోంది.. వివాదాలు పక్కన పెట్టి కలిసి పని చేసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీకి సీఎం జగన్ దగ్గర తెరపడింది. కలిసి పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత సూచించడంతో.. తప్పదన్నట్లు చేతులు కలిపారు ఇద్దరు నేతలు. 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం ఎమ్మెల్యే రాజా, ఎంపీ భరత్ మీడియా ముందుకు రానున్నారు.