Pawan Kalyan : మంగళగిరికి జనసేనాని

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం మంగళగిరి వెళ్లనున్నారు. జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

10TV Telugu News

Pawan Kalyan Mangalagiri : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం మంగళగిరి వెళ్లనున్నారు. జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులతో జనం ఇబ్బందులు, ట్రూ అప్‌ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులు, అదనపు వ్యాట్‌ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికారపార్టీ నేతల దౌర్జన్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

Read More : Posani Vs PK : పోసానిపై జనసేన ఫిర్యాదు

ఇందులో ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా శ్రమదానం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పవన్‌ నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం జరిగే సమావేశంలో దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించే అవకాశముంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆయా జిల్లాల అ్యక్షులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, అసెంబ్లీ ఇన్‌చార్జీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Read More : Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ హెల్త్ పై రిపబ్లిక్ డైరెక్టర్

సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు ప్రభుత్వ విధానాలపై పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాటిపై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేనాని.. వైసీపీ నేతల మధ్య మాటలు, ట్వీటుల యుద్ధమే నడుస్తోంది. రాజకీయంగా వాతావరణం వేడెక్కిన తరుణంలో జనసేన సమావేశం జరగనుంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

×