Posani Vs PK : పోసానిపై జనసేన ఫిర్యాదు

పోసాని కృష్ణమురళిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌. పోసానిని అడ్డుకునేందుకు పవన్ అభిమానులు యత్నించారు.

Posani Vs PK : పోసానిపై జనసేన ఫిర్యాదు

Posani

Posani Fight between Pawan fans : పోసాని కృష్ణమురళిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పవన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. జనసేన లీగల్ టీం నేతృత్వంలో రూపొందించిన ఫిర్యాదు కాపీని అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఎస్ఐ కౌశిక్‌కు అందజేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పోసానిని బహిష్కరించాలని కోరారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు శంకర్‌ గౌడ్‌.

Read More : Beautician Was Raped : పెరోల్‌పై వచ్చి బ్యూటీషియన్‌పై అత్యాచారం చేసిన హత్యకేసు నిందితుడు

మరోవైపు…పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు పోసాని కృష్ణమురళికి మధ్య మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పోసాని.. పవన్ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్.. కేసులు వరకు వెళ్లేలా కనిపిస్తోంది. ప్రెస్‌ క్లబ్‌ వేదికగా పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పోసాని కృష్ణమురళి. పవన్‌ అభిమానులు తనని తిడుతూ వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెడుతున్నారన్నారు. 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం పవన్‌పై కేసు పెడతానన్నారు. దీంతో పోసానిని అడ్డుకునేందుకు పవన్ అభిమానులు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read More : IPL 2021 PBKS Vs MI.. ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

ఏపీలో ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారం సినీ నటుల వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను నటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. దీంతో పవన్ అభిమానులు పోసానిని టార్గెట్ చేశారు. పవన్‌ అభిమానులు తనని తిడుతూ వేలాది ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెట్టారన్నారు పోసాని. తన కుటుంబ సభ్యుల గురించి.. మహిళల గురించి తప్పుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. కక్ష కట్టి మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని… పవన్‌ని కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించిన సంగతి గుర్తులేదా అని పోసాని గుర్తు చేశారు.

Read More : CM KCR : రజనీకాంత్ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

30ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటున్నానని.. తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు. తాను జగన్‌కు అభిమానినని.. ఆయనను ఏమైనా అంటే తనకు కోపం వస్తుందని అన్నారు. తనను హత్యచేయడానికి పవన్ కల్యాణ్‌ ప్లాన్ చేశారన్నారు పోసాని కృష్ణ మురళి. తన ఫ్యాన్స్‌తో కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు…తనకేమైనా అయితే అందుకు కారణం పవన్ కల్యాణే అన్నారు పోసాని. పవన్‌ కల్యాణ్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సహా పలువురిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. పోసానిని సైతం పోలీస్‌ ఎస్కార్ట్‌లో అక్కడి నుంచి పంపించారు. మరి ఈ వివాదం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనేది రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది.