Beautician Was Raped : పెరోల్‌పై వచ్చి బ్యూటీషియన్‌పై అత్యాచారం చేసిన హత్యకేసు నిందితుడు
హత్య కేసులో నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటకు వచ్చిన వ్యక్తి బ్యూటీషీయన్ పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.

Rape Attempt
Beautician Was Raped : హత్య కేసులో నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటకు వచ్చిన వ్యక్తి బ్యూటీషీయన్ పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.
నాసిక్ లోని పవన్ నగర్ కు చెందిన యువతి(27) బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఎప్పటి లాగే సోమవారం రాత్రి తన పార్లర్ లో పూజ చేసుకుంటూ ఉండగా పెరోల్ పై బయటకు వచ్చిన హత్యకేసు నిందితుడైన వ్యక్తి ఆమె పార్లర్ లోకి వచ్చాడు.
ఆమెకు కత్తి చూపించి బెదిరించి చేతులు వెనక్కి విరిచి కట్టేసి…. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక బాధితురాలు అంబద్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
Also Read : Woman Tied To Tree : తెలియని పురుషుడితో మాట్లాడిందని మహిళను చెట్టుకు కట్టేసి…..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి… పెరోల్ పై విడుదలై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు, అతని గురించి పోలీసులు గాలింపు చేపట్టారు.