Love Story : 50 ఏళ్ళ తర్వాత అదే డేట్ కి నా కొడుకు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు : నాగార్జున

 లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తుంది. ఇవాళ ఈ సినిమా సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా టాలీవుడ్ కింగ్

Love Story : 50 ఏళ్ళ తర్వాత అదే డేట్ కి నా కొడుకు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు : నాగార్జున

Love Story

Love Story : లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తుంది. ఇవాళ ఈ సినిమా సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున వచ్చారు.

లవ్ స్టోరి సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ.. ఇది లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ కన్నా హ్యూమానిటీ సక్సెస్ మీట్ లాగా కనిపిస్తుంది. లవ్ స్టోరి సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది అని అన్నారు. లవ్ స్టోరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు అని తెలిసింది. ఒక మంచి సినిమా తీస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు ప్రతి సారి నిరూపిస్తున్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు అని అన్నారు.

Nepotism : నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్

లవ్ స్టోరి ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అప్పుడప్పుడూ వస్తుంటాయి. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను అని అన్నారు నాగార్జున. నాన్న గారు నటించిన ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. అదే డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు కూడా తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి చైతు తన లవ్ స్టోరి సినిమాతో గొప్ప విజయాన్ని సాధించాడు.