Nepotism : నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి తర్వాత బాలీవుడ్‌ లో, బాలీవుడ్ బయట నెపోటిజంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై కొంతమంది బాలీవుడ్‌ నటీనటులు నిర్మాత కరణ్‌ జోహర్‌తో పాటు

Nepotism : నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్

Mallika

Nepotism :  బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి తర్వాత బాలీవుడ్‌ లో, బాలీవుడ్ బయట నెపోటిజంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై కొంతమంది బాలీవుడ్‌ నటీనటులు నిర్మాత కరణ్‌ జోహర్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటులపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొద్దిరోజులకు క్రమంగా ఈ వివాదం కాస్తా మర్చిపోయారు అందరూ. అయితే తాజాగా బాలీవుడ్ బోల్డ్ యాక్టర్ మల్లిక షెరావత్‌ నెపోటిజంపై మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల మల్లిక షెరావత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నెపోటిజంపై మాట్లాడింది.

మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. హీరోల గర్ల్‌ఫ్రెండ్స్‌, చెల్లెల్లు, బంధువుల కారణంగా ఆఖరి నిమిషాల్లో నన్ను సినిమాల నుంచి తీసేశారని తెలిపింది. నెపోటిజం కారణంగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు పోయాయి అని, కొన్నిసార్లు నన్ను సెలెక్ట్ చేసి తర్వాత నా ప్లేస్ లో హీరోల గర్ల్‌ఫ్రెండ్‌ని, వేరేవాళ్ళ గర్ల్‌ఫ్రెండ్‌ని, నటుల చెల్లెల్లని, బంధువులను తీసుకున్నారని , ఇది బాలీవుడ్ లో జరుగుతూనే ఉంటుందని, పరిశ్రమలో ఎన్నటికీ ఇది మారదు అని తెలిపింది.

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ హెల్త్ పై రిపబ్లిక్ డైరెక్టర్

కానీ ఇవేవి నేను పట్టించుకోలేదు. నా స్వయం శక్తిని నమ్ముకున్నాను. నా పని ఏంటి, నా షూటింగ్‌ ఏంటీ అనే దానిపైనే శ్రద్ధ పెట్టాను అని తెలిపింది. అంతే కాక బోల్డ్‌ సీన్స్‌లో నటించడం వల్ల నన్ను టార్గెట్‌ చేసి ట్రోల్ చేసేవారు. కానీ అదే బోల్డ్‌ సన్నివేశాల్లో నటించిన హీరోలని మాత్రం ఎవర్ని అనలేదు. మహిళలను మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేసేవారు. అదే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అని. ఈ సమస్య కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఎక్కడ చూసిన మహిళలనే టార్గెట్‌ చేస్తారు. కానీ ఇది ఇండియాలో కాస్తా ఎక్కువగా ఉంది అని బాధపడింది.