Nivetha Pethuraj : సినిమాలు మానేద్దాం అనుకున్నా.. పెళ్లి రద్దుపై మొదటిసారి స్పందించిన హీరోయిన్..
చాన్నాళ్ల తర్వాత సినీ మీడియా ముందుకు వచ్చిన నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖలు చేసింది. (Nivetha Pethuraj)
Nivetha Pethuraj
Nivetha Pethuraj : మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్, ధమ్కీ, అల వైకుంఠపురంలో, రెడ్.. ఇలా పలు తెలుగు సినిమాలతో తెలుగులో మంచి ఫేమ్, ఫాలోయింగ్ తెచ్చుకుంది నివేదా పేతురాజ్. 2025 లో నివేదా తన ప్రియుడిని పరిచయం చేస్తూ.. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ తో రిలేషన్లో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగానే ప్రకటించింది. కానీ ఆ రిలేషన్ బ్రేకప్ అయి పెళ్లి కూడా రద్దయింది.
గత రెండేళ్లుగా సినిమాల్లో నటించని నివేదా పేతురాజ్ తాజాగా సింగీతం శ్రీనివాసరం సింగ్ గీతం సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్ కి హాజరైంది. చాన్నాళ్ల తర్వాత సినీ మీడియా ముందుకు వచ్చిన నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖలు చేసింది.
Also See : Kirrak Seetha : కొడైకెనాల్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కిరాక్ సీత.. ఫొటోలు..
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. 2023లో నేను సినిమాలు మానేద్దాం అనుకున్నాను. నా లైఫ్ తప్పుడు దారుల్లో వెళ్తుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను అని అర్థమైంది. కానీ ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాతో మళ్ళీ ల్యాండ్ అయ్యాను. ఈ సినిమాతో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది. నాగ్ అశ్విన్ లేకపోతే ఇవాళ నేను లేను. హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక మంచి అవుట్ పుట్ వస్తుందని నమ్మాను. నేను సినిమా చూసి ఏడ్చాను అని తెలిపింది.
దీంతో ఇండైరెక్ట్ గా పెళ్లి, రిలేషన్ తప్పుడు నిర్ణయం అంటూ కామెంట్స్ చేయడం, సినిమాలు మానేద్దాం, హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
