Dussehra Celebrations : ఏపీలో అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు

అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

Dussehra Celebrations : అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి గురువారం అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నవరాత్రి వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు తెలిపారు మంత్రి. శానిటైజర్, భౌతిక దూరం ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలనీ తెలిపారు.

Read More : Bengaluru Blast : బెంగళూరులో భారీ పేలుడు..ముగ్గురు దుర్మరణం

టైం స్లాట్ ద్వారా రోజు పదివేల మంది భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. వృద్దులకు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తైందని.. వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు