Bengaluru Blast : బెంగళూరులో భారీ పేలుడు..ముగ్గురు దుర్మరణం

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించంది. ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందారు. నగరంలోని చామరాజపేట లోని భవనంలో సంభవించిన పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైపోయాయి.

Bengaluru Blast : బెంగళూరులో భారీ పేలుడు..ముగ్గురు దుర్మరణం

Bengaluru Blast

Bengaluru Blasting : కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించంది. ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందారు. నగరంలోని చామరాజపేట లోని భవనంలో సంభవించిన పేలుడు మృతదేహాలు తునాతునకలైపోయాయి. ఈ పేలుడు ధాటికి ప్రజలు భయంతో అటు ఇటు పరుగులు తీశారు.కాసేపు ఏం జరిగిందో ఆ శబ్ధం ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలియని అయోమయానికి గురయ్యారు స్థానికులు. ఈ పేలుడు శబ్దానికి ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిని సమీపంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు.

Read more : Fire Mishap : బెంగళూరులో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

కాగా భారీ పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమైపోవటంతో ఆ ప్రాంతమంతా భీతవహంగా మారిపోయింది. పేలుడు ప్రభావానికి స్థానికంగా భారీగా ఆస్థి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కానీ పేలుడుకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Read more : Fire Accident: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ సంజీవ్‌ పటేల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఓ గోడౌన్‌ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ప్రమాదంలో పంక్చర్ దుకాణం యజమాని అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం తెలుసుకోవటానికి యత్నిస్తున్నామని డీసీపీ హరీష్ పాండే వెల్లడించారు.