Duvvada Srinivas
Duvvada Srinivas : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి రోడ్డుపై హల్‌చల్ చేయడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని.. తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ దువ్వాడ ఆరోపించారు. జాతీయ రహదారిపై నిలబడి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన దాస్ – ధర్మాన ప్రసాద్ రావులపై, మంత్రి అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యాడు. కింజరాపు, ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు. నన్ను టార్గెట్ చేశారని, నాపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు.
తనపై దాడి చేయబోతున్నారంటూ మాధురికి ఫోన్ కాల్‌లో అప్పన్న అనే వ్యక్తి చెప్పాడని శ్రీనివాస్ పేర్కొన్నారు. మాధురి, అప్పన్నల ఆడియోను శ్రీనివాస్ బహిర్గతం చేశాడు. తనకు ఏం జరిగినా కింజరాపు, ధర్మాన సోదరులదే బాధ్యత అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తాజా ఘటనపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపాడు.