Srinivas Duvvada
నామ్ కమానా. పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడాలి. రాజకీయాల్లో అయితే నిజాయితీగా ఉండి..పోరాడి నిలబడి క్యారెక్టర్ను నిలబెట్టుకోవాలి. కానీ చిన్న ఇష్యూ ఎదిగిన మనిషిని..ఢమాల్మని కిందపడేస్తుంది. ఏపీలో ఓ నేత పరిస్థితి ఇలానే ఉందట. ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..ఒకే ఒక ఇష్యూతో కార్నర్ అయిపోయారు.
కుటుంబ సమస్యలు ఏమైనా ఉండొచ్చు.. కానీ తన ఎత్తు బిడ్డలు ఉండగా..తనకంటే 30ఏళ్లు చిన్న వయసున్నామెతో ప్రేమ వ్యవహారం నడపడటంతో ఆ ప్రేమ కథా చిత్రమ్ వెబ్ సిరీస్ అయిపోయింది. సీజన్ల వారీగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సరే ఇంత జరిగిందని దువ్వాడ సైలెంట్గా ఉంటున్నారా అంటే వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం..తిరుమల టూర్లో ఓవరాక్షన్ చేయడంతో ఫ్యాన్ పార్టీ నేతలకు చిరాకు తెప్పిస్తుందట. ఇప్పటికే పరువు పోయిందని మూసుకుని కూర్చోక..షో చేయడమేందుకని ఆగ్రహం మీదున్నారట.
ఇప్పుడు ఆయన యూట్యూబ్ స్టార్!
రెండు నెలల క్రితం వరకు సిక్కోలు జిల్లా రాజకీయాలకే పరిమితమైన దువ్వాడ.. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ అయిపోయారు. నాలుగు దశాబ్దాల నుంచి క్రియాశీలక రాజకీయ నేతగా ఉన్నప్పటికీ..కుటుంబ వివాదంతో ప్రతీ ఒక్కరి నోట దువ్వాడ పేరు వినిపిస్తోంది. ప్రేయసి కోసం భార్య పిల్లలను వదిలేసి వార్తలకెక్కిన ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటున్నారు.
రచ్చ జరగడంతో దువ్వాడను టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం. పంచాయితీ అధినేత దగ్గరకు వెళ్లడంతో జిల్లా నేతలు కూడా..దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. దువ్వాడ వివాదంలో ఒక్క వైసీపీ నేత కూడా నోరు విప్పలేదు. తాము మాట్లాడితే ప్రజల్లో అభాసుపాలవుతామని భయంతో కిక్కురుమనలేదు నేతలెవరు.
ఇక వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సిక్కోలు జిల్లా సమీక్షల్లో కూడా.. దువ్వాడను డైరెక్ట్గా టార్టెట్ చేశారట లీడర్లు. జిల్లా మాజీ ఏమ్మెల్యేలు..ఇక మరో సీనియర్ మహిళా నేత అయితే దువ్వాడ ఇష్యూతో తల ఎత్తుకోలేకపోతున్నామని, బయట తిరగలేకతున్నామని అధినేతకు చెప్పారట. వైసీపీ మహిళలకు అన్యాయం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయని జగన్కు తెగేసి చెప్పేశారట. కొందరు సీనియర్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారట.
తిరుమలకు వెళ్లి.. మరింత వివాదం..
అయితే వివాదం ముగుస్తుందనుకున్న సమయంలో మాధురితో కలిసి..దువ్వాడ తిరుమల టూర్కు వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటామని మాధురి తిరుమలలో ప్రకటించడం మరింత వివాదంగా మారింది. ఇద్దరికి భార్య, భర్త, పిల్లలు ఉన్నారని, విడాకులు కాకుండానే పెళ్లి గురించి ప్రకటించడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మహిళల సమస్యలపై పార్టీ పరంగా ఎలా పోరాడతాముంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే టీటీడీ లడ్డూ వివాదంలో వైసీపీ, కూటమి నేతత మధ్య పెద్ద యుద్దమే జరుగుతుండగా..ఇంతలో దువ్వాడ తిరుమలకు వెళ్లి మరోసారి వార్తల్లో నిలవడంతో తలలు పట్టుకుంటున్నారట వైసీపీ పెద్దలు. ఆయన కనిపిస్తే చాలు బాబోయ్ దువ్వాడ అంటున్నారట.
ఇలా సహజీవనం పేరుతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నట్లు అంటూ వైసీపీ మహిళా నేతలైతే వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద చర్చనే నిర్వహిస్తున్నారట. అసలే ఓటమి బాధతో ఉండి కూటమి స్పీడ్ను తట్టుకోలేక సమతమవుతుటే..మధ్యలో వీళ్ల గోల ఏంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట వైసీపీ నేతలు.
రూ.7వేల కోట్ల స్కామ్..! కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరో కుంభకోణం..