టెక్కలి పాలిటిక్స్‌లో దువ్వాడ వాణి యాక్టీవ్ రోల్.. తనతో విబేధించిన భర్తకు పొలిటికల్‌గా షాకిచ్చే స్కెచ్

అంత‌ర్గతంగా మాత్రం వాణి బ‌లం, ఆమె ఆర్థిక ప‌రిస్థితి..క‌లుపుగోలు త‌నం వంటివాటిపై మాత్రం వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

దువ్వాడ వాణి (Photo: Facebook)

టెక్కలి పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు దువ్వాడ వాణి. పార్టీ యాక్టివిటీలో కీరోల్ ప్లే చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ..అపోజిషన్‌ రోల్‌లో కూటమి ప్రభుత్వ తీరుపై పోరాడుతూ తన మార్క్ చూపిస్తున్నారు. ఫ్యామిలీ గొడవల సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌గా అందరికీ తెలిసిన దువ్వాడ వాణిది ముందు నుంచి రాజకీయ కుటుంబం. గత ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇంచార్జ్‌గా కూడా పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.

ఇప్పుడు టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌తో క్లాషెస్‌ రావడం..కోర్టులకెక్కి రచ్చ జరిగాక..కొన్నాళ్లు సైలెంట్‌ అయ్యారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను టెక్కలి వైసీపీ ఇంచార్జ్‌గా నియమించింది అధిష్టానం. అయినా నియోజకవర్గ పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్నారు దువ్వాడ వాణి.

Also Read: కొత్త అధ్యక్షుడి రాక వేళ ఏపీ బీజేపీలో జోష్.. ఏపీలో కమలం ఫేట్ మారుతుందా?

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బట్టల వ్యాపారం, యూట్యూబ్‌ ఇంటర్య్యూలు, ఇన్‌స్టా రీల్స్‌ అంటూ హడావుడి చేస్తుంటే..దువ్వాడ వాణి మాత్రం గ్రౌండ్‌లోనే ఉంటూ..రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి తరఫున ఆమెకు పొలిటికల్‌ బ్యాగ్రౌండ్ ఉంది. పైగా ఇప్పుడు సిట్టింగ్ జెడ్పీటీసీ. మొన్నటి ఎన్నికలకు ముందు వరకు కూడా టెక్కలి వైసీపీ ఇంచార్జ్‌గా ఆమెనే కొనసాగారు. భర్త బరిలోకి దిగడంతో సైలెంట్‌గా ఉండిపోయారు. ఫ్యామిలీ గొడవలతో శ్రీనివాస్‌ తనకు దూరమైనా ఆమె మాత్రం టెక్కలి పాలిటిక్స్‌లో తన మార్క్ చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీను, మాధురి ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంటే..వాణి మాత్రం టెక్కలిని కేరాఫ్‌గా చేసుకుని పనిచేసుకుంటూ పోతున్నారు.

దువ్వాడ వాణి కామెంట్స్‌ రాజ‌కీయంగా హాట్ టాపిక్
అంతేకాదు దువ్వాడ వాణి కామెంట్స్‌ రాజ‌కీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ పిలుపునిచ్చిన రీకాల్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. స్థానిక స‌మ‌స్యల‌పై నిరాహార దీక్ష కూడా చేస్తాన‌ని చెప్పి చర్చకు దారి తీశారు. అయితే కొన్నాళ్ల కింద‌టే దువ్వాడ శ్రీనును పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఆయన కూడా పార్టీని బ్రతిమాలుకుని దగ్గరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంద‌నే ధోరణిలో దువ్వాడ శ్రీను కనిపిస్తున్నారు.

పైగా దివ్వెల మాధురితో కలిసి హైదరాబాద్‌లో స్యారీ బిజినెస్‌ స్టార్ట్ చేసి..యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఇన్‌స్టా రీల్స్ తీసుకోవడంలో బిజీ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో టెక్కలిలో వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తానంటూ..వాణి చేసిన ప్రక‌ట‌న రాజ‌కీయంగా ప్రాధాన్యత ద‌క్కించుకుంది. జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తే..తాను ఇంటింటికీ తిరుగుతాన‌ని..ప్రభుత్వ వ్యతిరేక‌త‌ను పార్టీకి అనుకూలంగా మార్చుతాన‌ని వాణి చెప్పుకొచ్చారు. ఆమె విజ్ఞప్తిపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అయితే..అంత‌ర్గతంగా మాత్రం వాణి బ‌లం, ఆమె ఆర్థిక ప‌రిస్థితి..క‌లుపుగోలు త‌నం వంటివాటిపై మాత్రం వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్‌తో పోలిస్తే వాణి అంత బ‌ల‌మైన నాయ‌కురాలు కాద‌నేది కొంద‌రు చెబుతున్న మాట‌. ఒక‌వేళ ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తే..అది మ‌రోసారి టీడీపీకి మేలు చేయ‌డ‌మే అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలానే వాణికి టికెట్ ఇవ్వాల‌ని భావించిన అధిష్టానం వెన‌క్కి త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో వాణికి మ‌రోసారి అవ‌కాశం ఇస్తే..ఆమె గెలిచే అవకాశాలున్నాయా.? అనే కోణంపై చ‌ర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో టెక్కలి వైసీపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.